top of page

నా గురించి - నాగరాజ్ ఉండ్రమట్ల గారు

Writer's picture: Harinath Babu BHarinath Babu B

Updated: Dec 28, 2021

నువ్వు తోపు రా ట్రైలర్ విడుదల తర్వాత రచయిత నాగరాజ్ ఉండ్రమట్ల ఫేస్‌బుక్ పేజీలో నా గురించి - https://www.facebook.com/rajundramatla/posts/836154739928043

హరినాథ్ బాబు మరియు నాగరాజ్ ఉండ్రమట్ల
హరినాథ్ బాబు మరియు నాగరాజ్ ఉండ్రమట్ల

నా స్నేహితుడు దర్శకుడయ్యాడు

ప్రభాస్ హీరో గా నటించిన మొదటి సినిమా ఈశ్వర్ ఫిల్మ్ కి నేను అసిస్టెంట్ రైటర్ గా వర్క్ చేసాను. అప్పుడు పరిచయమయ్యాడు మిత్రుడు Harinath Babu.


దాని తరువాత నేను ETV లో నమ్మలేని నిజాలు డైరెక్ట్ చేసేటప్పుడు తానుకూడా నమ్మలేని నిజాలకి దర్శకుడిగా పనిచేసాడు.


శశిరేఖా పరిణయం సినిమా సెట్స్‌పై, ఎడమ నుండి కుడికి - తరుణ్, హరినాథ్ బాబు, నాగరాజ్ ఉండ్రమట్ల వెనుక, కుడివైపు జెనీలియా
శశిరేఖా పరిణయం సినిమా సెట్స్‌పై, ఎడమ నుండి కుడికి - తరుణ్, హరినాథ్ బాబు, నాగరాజ్ ఉండ్రమట్ల వెనుక, కుడివైపు జెనీలియా

ఆ తరువాత కృష్ణవంశీ దర్శకత్వం చేసిన శశిరేఖా పరిణయం ఫిల్మ్ కి నేను మాటలు రచయితగా వర్క్ చేస్తే తాను ఆ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేసాడు. కృష్ణవంశీ గారు ఫలానా సీన్ కి ఏ లెన్స్ పెట్టబోతున్నారు, ఎలాంటి షాట్ ని తియ్యబోతున్నారో నని గెస్ చేసి నాకు, కెమెరా మెన్ భాస్కర్ కి ముందే చెప్పేవాడు. తాను ఏం చెప్పాడో కృష్ణవంశీ గారు అదే తీయడంతో నేను ఆశ్చర్యపోయేవాడిని. అప్పుడే నాకర్ధమైంది తాను మంచి దర్శకుడవుతాడని.


లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నాగరాజు గా అలరించిన సుధాకర్ హీరో గా నువ్వు తోపు రా అనే సినిమాకి దర్శకత్వం చేసాడు. ఈ ఫిల్మ్ త్వరలో రిలేజ్ కాబోతుంది. టీజర్ చూడగానే మంచి హిట్ కొడతాడనే నమ్మకం నాకు కలిగింది. నాకంత బాగా నచ్చింది ఈ టీజర్.


సరైన హిట్ కొట్టడం అంటే అర్ధం సినిమా చూసి ఆడియన్స్ చప్పట్లు కొట్టాలి, విజిల్స్ కొట్టాలి, సినిమా రికార్డ్స్ బద్దలు కొట్టాలి. ఇన్ని'కొట్టడాలు' ఈ సినిమాకి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మిత్రుడు హరినాద్ బాబుకి, హీరో సుధాకర్ గారికి, నిర్మాతలు, టెక్నిసన్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.


నువ్వు తోపు రా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్; ఎడమ నుండి - బేబీ జహానవి, శ్రీకాంత్ దాదుబాయి, హరినాథ్ బాబు, నిరోషా, విజయ్ దేవరకొండ, సుధాకర్ కోమాకుల, నిత్య శెట్టి
నువ్వు తోపు రా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్; ఎడమ నుండి - బేబీ జహానవి, శ్రీకాంత్ దాదుబాయి, హరినాథ్ బాబు, నిరోషా, విజయ్ దేవరకొండ, సుధాకర్ కోమాకుల, నిత్య శెట్టి

Recent Posts

See All

コメント


bottom of page